ఆ రాష్ట్రాలలో కేసీఆర్ ఫొటో కూడా పెట్టండి: హరీశ్ రావు
- కామారెడ్డిలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో పెట్టాలంటూ కలెక్టర్‌కు సూచించిన వైనం
- దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటన్న హరీశ్ రావు
- మీరలా అడిగితే... మేమిలా అడగరాదా? అంటూ కేంద్ర మంత్రికి ప్రశ్న
తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఓ డిమాండ్‌కు బదులిచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రానికి కూడా ఓ డిమాండ్ చేశారు. కేంద్రంతో పాటు తెలంగాణ నిధులు వెళుతున్న రాష్ట్రాల్లో కేసీఆర్ ఫొటోను పెట్టండి అంటూ ఆయన ఓ వినూత్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి తెలంగాణ అందిస్తున్న పన్ను వాటాను హరీశ్ రావు ప్రస్తావించారు.
రేషన్ షాపుల్లో ప్రజలకు చౌక ధరలకే బియ్యం పంపిణీ చేస్తున్న వైనాన్ని పరిశీలించిన సందర్భంగా నిర్మలా సీతారామన్... కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను నిలదీసిన సంగతి తెలిసిందే. రేషన్ బియ్యం ఖర్చులో కేంద్రం వాటా ఎంత? అంటూ ఆమె కలెక్టర్‌ను నిలదీశారు. ఈ సందర్భంగా కేంద్రం నిధులతో రేషన్ బియ్యం పంపిణీ అవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను రేషన్ షాపుల్లో పెట్టాలని ఆమె వ్యాఖ్యానించారు.
నిర్మల వ్యాఖ్యలు విన్నంతనే హరీశ్ రావు చాలా వేగంగా స్పందించారు. ప్రధాని ఫొటోలను రేషన్ షాపుల్లో పెట్టాలనడం హాస్యాస్పదమన్న హరీశ్ రావు... ప్రధాని పదవి స్థాయిని దిగజార్చే విధంగా నిర్మల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటన్న హరీశ్... తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.65 లక్షల కోట్లు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ నుంచి వెళ్లిన నిధులను దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారన్న హరీశ్... ఆ రాష్ట్రాల్లో కేసీఆర్ ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. మీరలా అడిగితే... మేం ఇలా అడగకూడదా? అంటూ కేంద్ర మంత్రిని ఆయన ప్రశ్నించారు.