దేశంలో తగ్గుతున్న కరోనా వ్యాప్తి.. 50 వేల దిగువకు చేరిన యాక్టివ్ కేసులు

  • గత 24 గంటల్లో 6,168 పాజిటివ్ కేసుల నమోదు
  • 59,210కి తగ్గిన యాక్టివ్ కేసులు
  • కరోనా కారణంగా నిన్న 21 మంది మృతి
మన దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 3,18,642 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 6,168 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 9,685 మంది కరోనా నుంచి కోలుకోగా... 21 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసులు 50 వేల దిగువకు రావడం ఊరటను కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో 59,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,44,42,507కు పెరిగింది. వీరిలో 4,38,55,365 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,27,932 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.94 శాతంగా, రికవరీ రేటు 98.68 శాతంగా, క్రియాశీల రేటు 0.13 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 212.75 కోట్ల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.


More Telugu News