రైలులో వడ్డించిన ఆహారానికి మురిసిపోయిన నాగాలాండ్ మంత్రి
- అద్భుతమైన విందు అంటూ ట్విట్టర్లో స్పందన
- రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఆహారానికి అభినందనలు
- ఆహారమే జీవితం అంటూ ట్వీట్
రైలు ప్రయాణ సమయంలో అందించే ఆహారం చాలా రుచిగా ఉంటే..? దాన్ని ఎప్పటికీ మరిచిపోరు. భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్సీటీసీ ఇప్పుడు ఇదే చేస్తోంది. ప్రీమియం రైళ్లలో ప్రీమియం ఫుడ్ సరఫరా చేస్తోంది. రాజధాని ఎక్స్ ప్రెస్ లో భాగంగా సరఫరా చేసిన ఆహారానికి నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్నా అభిమానిగా మారిపోయారు. ఇటీవలే ఆయన గువహటి నుంచి దిమాపూర్ కు రాజధాని ఎక్స్ ప్రెస్ లో వెళ్లారు.
ప్రయాణ సమయంలో రోటి, దాల్, రైస్, ఇతర పదార్థాలను అందించారు. ఈ సేవను తెంజెన్ అభినందించారు. ట్విట్టర్లో రైల్వే మంత్రికి తన స్పందనను ట్యాగ్ చేశారు. ‘‘జీవితం ఓ ప్రయాణం. ప్రయాణాన్ని ఆస్వాదించండి. ఆహారమే జీవితం. ఆహారాన్ని తీసుకోకుండా ఉండకండి. రాజధాని ఎక్స్ ప్రెస్ లో అద్భుతమైన విందుకి కృతజ్ఞతలు’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
దీనికి ఐఆర్సీటీసీ ధన్యవాదాలు తెలిపింది. యూజర్లలో కొందరు తమకు అలాంటి ఆహారాన్ని ఎందుకు అందించరు? అని ప్రశ్నిస్తున్నారు. రైల్వే రోజురోజుకీ పురోగతి చెందుతోందని, ప్రపంచంలోనే అగ్రస్థాయి రైల్వేగా అవతరిస్తుందని మరొకరు అభిప్రాయం తెలిపారు.