వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘన నివాళి అర్పించిన జగన్, విజయమ్మ, షర్మిల.. వీడియో ఇదిగో!

  • ఈరోజు దివంగత వైఎస్సార్ వర్ధంతి
  • 2009 సెప్టెంబర్ 2న వైఎస్ మృతి
  • ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కుటుంబసభ్యులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి జగన్, విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిళ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీరంతా ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి 1949 జులై 8న కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారు. 1978లో వైఎస్సార్ రాజకీయ అరంగేట్రం చేశారు. 1978, 1983, 1985 లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి... 1989, 1991, 1996, 1998 లో కడప లోక్ సభ స్థానం నుంచి... ఆ తర్వాత 1999, 2004, 2009 లో పులివెందుల నుంచి విజయం సాధించారు. ఐదేళ్ల మూడు నెలల పాటు సీఎంగా పని చేశారు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ క్రాష్ అయిన ఘటనలో ఆయన దుర్మరణం చెందారు. 

మరోవైపు, ఈరోజు విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి స్థానిక నేతలు, అధికారులు హాజరుకానున్నారు.


More Telugu News