మళ్లీ బ్యాట్ పట్టబోతున్న వీరేంద్ర సెహ్వాగ్

  • ఈ నెల 16 నుంచి కోల్ కతాలో ఎల్ఎల్సీ రెండో ఎడిషన్
  • గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్ గా వీరూ
  • ఈ జట్టు యజమాని గౌతమ్ అదానీ
భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ది ఒక ప్రత్యేక చరిత్ర. టీమిండియాకు ఎన్నో ఘన విజయాలను అందించిన సెహ్వాగ్ మళ్లీ బ్యాట్ పట్టబోతున్నాడు. ఎల్ఎల్సీలోకి వీరూ ఎంట్రీ ఇస్తున్నాడు. గుజరాత్ జెయింట్స్ జట్టుకు సెహ్వాగ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ జట్టు యజమాని వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీది కావడం గమనార్హం. 

ఈ సందర్భంగా వీరూ మాట్లాడుతూ, మళ్లీ గ్రౌండ్ లోకి దిగుతుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. మళ్లీ క్రికెట్ ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉందని తెలిపాడు. జట్టును ఎంపిక చేసే ప్రక్రియ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పాడు. సెప్టెంబర్ 16న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఎల్ఎల్సీ రెండో ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గుజరాత్ జెయింట్స్, ఇండియా కేపిటల్స్, ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ నాలుగు జట్లు ఆడనున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా బీసీసీఐ ఈ టోర్నీని నిర్వహించనుంది. ఇండియా మహారాజాస్ జట్టుకు బీసీసీఐ బాస్ గంగూలీ సారధ్యం వహించనున్నారు.


More Telugu News