పరమచెత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ కు పట్టం కట్టిన బ్రిటన్ వాసులు
- ఇటీవల ప్రధాని పదవి నుంచి తప్పుకున్న బోరిస్ జాన్సన్
- వివాదాలతో మసకబారిన జాన్సన్
- ఓ సంస్థ నిర్వహించిన పోల్ లో జాన్సన్ కు 49 శాతం ఓట్లు
- దారుణమైన పాలన అందించాడన్న ప్రజలు
అస్తవ్యస్త నిర్ణయాలు, వివాదాలతో బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం తెలిసిందే. ముఖ్యంగా, కరోనా సంక్షోభ సమయంలో బోరిస్ జాన్సన్ వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశం అయింది. ప్రజలను గాలికొదిలేసి మందు పార్టీలు చేసుకున్నారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా, బోరిస్ జాన్సన్ పై ప్రజల్లో ఇప్పటికీ కోపం తొలగిపోలేదు. 1945 తర్వాత బ్రిటన్ చరిత్రలో పరమచెత్త ప్రధాని బోరిస్ జాన్సనే అని ప్రజలు తీర్మానించారు. ఓ సంస్థ నిర్వహించిన పోల్ లో 49 శాతం మందికి పైగా జాన్సన్ దారుణమైన పాలన అందించారని అభిప్రాయపడ్డారు. ఈ చెత్త ప్రధాని ఓటింగ్ లో థెరెస్సా మే 41 శాతం, డేవిడ్ కామెరాన్ 38 శాతం ఓట్లతో బోరిస్ జాన్సన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఇక బ్రిటన్ ప్రధానిగా అత్యుత్తమ సేవలు అందించినవారిలో దిగ్గజ నేత విన్ స్టన్ చర్చిల్ 62 శాతం ఓటింగ్ తో అగ్రస్థానం అందుకున్నారు. ప్రధానిగా దేశ ప్రజలకు మెరుగైన సేవలు అందించారని చర్చిల్ కు బ్రిటన్ వాసులు కితాబిచ్చారు.