తన వాట్సాప్ గ్రూప్‌ను క‌బ్జా చేశారంటూ పోలీసుల‌కు జ‌డ్చ‌ర్ల‌ మ‌హిళా కౌన్సిల‌ర్‌ ఫిర్యాదు

  • స‌హ‌చ‌ర కౌన్సిల‌ర్ల‌తో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన మ‌హిళా కౌన్సిల‌ర్‌
  • త‌న‌నూ స‌భ్యురాలిగా చేర్చుకోవాలంటూ 25వ వార్డు కౌన్సిల‌ర్ అభ్య‌ర్థ‌న‌
  • గ్రూప్‌లో చేరాక అడ్మిన్‌నే తొల‌గించిన 25వ వార్డు కౌన్సిల‌ర్‌
  • పోలీసుల‌కు గ్రూప్ క్రియేట్ చేసిన కౌన్సిల‌ర్ ఫిర్యాదు
తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల పోలీసులకు గురువారం ఓ వింత ఫిర్యాదు అందింది. తాను క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్‌ను క‌బ్జా చేశారంటూ జ‌డ్చ‌ర్ల మునిసిపాలిటీకి చెందిన మ‌హిళా కౌన్సిల‌ర్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎలా స్పందించాలో తెలియ‌క జ‌డ్చర్ల పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు.

ఈ కేసు వివ‌రాల్లోకి వెళితే... జ‌డ్చ‌ర్ల మునిసిపాలిటీకి చెందిన ఓ మ‌హిళా కౌన్సిల‌ర్ స‌హ‌చ‌ర కౌన్సిల‌ర్ల‌తో ఓ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు‌. ఈ గ్రూప్‌లో త‌నను కూడా యాడ్ చేయాలంటూ 25వ వార్డు కౌన్సిల‌ర్‌గా ఉన్న మ‌రో మ‌హిళా నేత అడ్మిన్‌గా ఉన్న లేడీ కౌన్సిల‌ర్‌ను కోరారు‌. స‌హ‌చ‌ర కౌన్సిల‌ర్ అభ్య‌ర్థ‌న‌కు సానుకూలంగా స్పందించిన అడ్మిన్ కౌన్సిల‌ర్‌... ఆమెను గ్రూప్‌లో యాడ్ చేశారు‌. ఆ త‌ర్వాత కొత్త‌గా గ్రూప్‌లోకి యాడ్ అయిన మ‌హిళా కౌన్సిల‌ర్ అడ్మిన్‌గా ఉన్న కౌన్సిల‌ర్‌ను అడ్మిన్ నుంచి తొల‌గించారు‌. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ గ్రూప్‌ను క్రియేట్ చేసిన మ‌హిళా కౌన్సిల‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు‌.


More Telugu News