మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
- ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స భేటీ
- ఫేస్ రికగ్నిషన్ యాప్‌పై ప్రధానంగా చర్చ
- సర్వీస్ రూల్స్‌లో ఉన్న వాటినే అమలు చేస్తున్నామన్న మంత్రి
ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం భేటీ అయ్యారు. ఫేస్ రికగ్నిషన్ యాప్ సహా ఉపాధ్యాయ సంఘాలు ప్రస్తావించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఆయన చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలతో ప్రధానంగా 2 అంశాలపై చర్చించామని, యాప్‌లో సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కారిస్తామని తెలిపారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.
టీచర్లపై పెట్టిన కేసుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని, గురువారం రాష్ట్రవ్యాప్తంగా 86 శాతం మంది ఉపాధ్యాయులు యాప్‌లో హాజరు నమోదు చేశారని బొత్స తెలిపారు. సర్వీస్ రూల్స్‌లో ఉన్న అంశాలనే అమలు చేస్తున్నామని, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు మంచి చేయాలనేదే తమ తపన అని వ్యాఖ్యానించారు. సీపీఎస్ అంశంపై మూడ్రోజుల్లో ఉద్యోగులతో చర్చిస్తామన్న బొత్స... 670 ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని సీఎం చెప్పారని తెలిపారు. 248 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంఈఓలుగా నియమిస్తామని, కొత్తగా 38 డిప్యూటీ డీఈఓ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.