'లైగర్' సినిమా కోసం మైక్ టైసన్ అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడా?
- రూ. 90 కోట్లతో తెరకెక్కిన 'లైగర్'
- బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ చిత్రం
- టైసన్ రూ. 23 కోట్లు తీసుకున్నాడని ప్రచారం
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. బాక్సర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చాలా మంది భావించారు. ఈ సినిమాకు చేసిన ప్రమోషన్లు కూడా ఓ రేంజ్ లోనే ఉన్నాయి. ప్రమోషన్ల సందర్భంగా ప్రతి సిటీలో హీరో, హీరోయిన్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అయితే, ఇవేవీ కూడా వారిని థియేటర్ల వరకు తీసుకురాలేకపోయాయి. విడుదలయ్యాక తొలి ఆటతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత కోలుకోలేదు.
ఇక ఈ సినిమాను దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని చెపుతున్నారు. దీంతో, కలెక్షన్ల పరంగా చూస్తే ఈ సినిమా భారీ నష్టాలనే మిగిల్చినట్టయింది. మరోవైపు ఈ సినిమాలో నటించిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారట. టైసన్ ఏకంగా రూ. 23 కోట్లు తీసుకున్నాడని ఓ వార్త వైరల్ అవుతోంది. అంటే మొత్తం పెట్టుబడిలో టైసన్ ఖర్చే ఎక్కువ అనుకోవచ్చు.