తొలిసారి సీఎంగా చంద్ర‌బాబు ప‌ద‌వి చేప‌ట్టి నేటికి స‌రిగ్గా 27 ఏళ్లు.. శుభాకాంక్షలు చెబుతూ టీడీపీ పోస్ట్

  • 1995 సెప్టెంబ‌ర్ 1న ఉమ్మ‌డి ఏపీ సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌
  • ఉమ్మ‌డి ఏపీకి 8 సంవత్సరాల 8 నెలల 13 రోజుల పాటు సీఎంగా కొన‌సాగిన వైనం
  • మొత్తంగా 13 సంవత్సరాల 7 నెలల 35 రోజుల పాటు సీఎంగా కొన‌సాగిన చంద్ర‌బాబు
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు తొలిసారిగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి గురువారం నాటికి స‌రిగ్గా 27 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. తొలుత ఉమ్మ‌డి ఏపీకి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు... ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టారు. త‌న రాజ‌కీయ జీవితంలో మొత్తంగా సీఎం ప‌ద‌విలో చంద్ర‌బాబు 13 సంవత్సరాల 7 నెలల 35 రోజుల పాటు కొన‌సాగారు. ఈ విష‌యాల‌ను వెల్ల‌డించ‌డంతో పాటుగా చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ టీడీపీ త‌న అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల్లో వ‌రుస పోస్టుల‌ను పోస్ట్ చేసింది.

1995, సెప్టెంబర్ 1... అంటే 27 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టార‌న్న టీడీపీ.. ఆ ప‌ద‌విలో ఏకంగా 8 సంవత్సరాల 8 నెలల 13 రోజులు ఉన్నార‌ని తెలిపింది. ఈ కాలంలోనే విజనరీ లీడర్ అన్న పదాన్ని తొలిసారిగా దేశానికి పరిచయం చేశార‌ని తెలిపింది. రాష్ట్ర విభజన జరిగాక కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు..  మొత్తంగా 13 సంవత్సరాల 7 నెలల 35 రోజులు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేశార‌ని పేర్కొంది.


More Telugu News