ఎన్డీయేలోకి టీడీపీ అంటూ ప్రచారం... స్పందించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్

  • ఎన్డీయేలోకి టీడీపీ అంటూ ఇటీవల వార్తలు 
  • ఆ కథనాల్లో వాస్తవంలేదన్న లక్ష్మణ్
  • ఏపీలో తాము జనసేనతో కలిసి పోటీ చేస్తామని వెల్లడి
  • టీడీపీతో ఏమైనా భాగస్వామ్యం ఉంటే చెబుతామని వివరణ
బీజేపీ ఎంపీ, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్డీయేలోకి టీడీపీ అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. అది కేవలం ప్రచారం మాత్రమేనని అన్నారు. ఎన్డీయేలోకి టీడీపీ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ భాగస్వామి జనసేన అని స్పష్టం చేశారు. తాము ఏపీలో జనసేనతోనే కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. ఒకవేళ టీడీపీతో భాగస్వామ్యం కుదిరితే ఆ విషయం అందరికీ తెలియజేస్తామని లక్ష్మణ్ అన్నారు. ఏపీలో సీఎం జగన్ పట్ల ప్రజావ్యతిరేకత ఉందని, దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటామని చెప్పారు.


More Telugu News