కెరీర్ చివర్లో సెరెనా విలియమ్స్ అద్భుత విజయం
- యూఎస్ ఓపెన్ రెండో రౌండ్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ కు చెక్
- మూడో రౌండ్ దూసుకెళ్లిన అమెరికా దిగ్గజ క్రీడాకారిణి
- ఎంతో సాధించా.. కోల్పోయేది ఏమీ లేదంటున్న సెరెనా
అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ తన కెరీర్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్ తర్వాత ఆమె రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో ఆమె ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తుతున్నారు. సాధారణంగా టెన్నిస్ గ్రాండ్ స్లామ్ పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ తర్వాతనే స్టేడియాలు అభిమానులతో నిండిపోతుంటాయి.
కానీ, సెరెనా కోసం ఆరంభ రౌండ్లలోనే యూఎస్ ఓపెన్ కు ఆతిథ్యం ఇస్తున్న ఆర్థర్ ఆషే ప్రధాన స్టేడియం కిక్కిరిసిపోతోంది. సామాన్యులతో పాటు టైగర్ వూడ్స్ వంటి సెలెబ్రిటీలు కూడా వస్తున్నారు. వాళ్లు ఏ మాత్రం నిరాశ పడకుండా యూఎస్ ఓపెన్ రెండో రౌండ్లో సెరెనా అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం పెద్దగా ఫామ్ లోని అమెరికా దిగ్గజం.. ప్రపంచ రెండో ర్యాంకర్ అనెట్ కొంటావీట్ కు షాకిచ్చి మూడో రౌండ్ దూసుకెళ్లింది.
భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ లో అన్ సీడెడ్ సెరెనా 7-6(4), 2-6, 6-2తో రెండో సీడ్ కొంటావీట్ ను ఓడించి అందరనీ ఆశ్చర్యపరిచింది. ఐదేళ్ల నుంచి ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా నెగ్గని సెరెనా... వయసు మీద పడి, గాయాల కారణంగా మునుపటి లయ కోల్పోయింది. పలు టోర్నీల్లో ఒకటి, రెండు రౌండ్లలోనే వెనుదిరుగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రపంచ రెండో ర్యాంకర్ తో మ్యాచ్ కావడంతో యూఎస్ ఓపెన్ లోనూ సెరెనాకు రెండో రౌండే ఆఖరు అని, దానితోనే ఆమె వీడ్కోలు పలకొచ్చని అంతా భావించారు. కానీ, వాళ్ల అంచనాలను సెరెనా తలకిందులు చేసింది. కొంటావీట్ నుంచి ఎదురైన కఠిన సవాల్ ను తిప్పికొట్టిన 41 ఏళ్ల సెరెనా తనపనైపోలేదని నిరూపించుకుంది. ఈ మ్యాచ్ తొలి సెట్ ను టై బ్రేక్ లో గెలిచిన సెరెనా రెండో సెట్ లో తడబడింది. ఇందులో ఎనిమిది గేమ్స్ లో ఆరింటిని నెగ్గిన కొంటావీట్ మ్యాచ్ లో నిలిచింది. అయితే, నిర్ణాయక మూడో సెట్ లో సెరెనా గొప్పగా పుంజుకుంది. మనుపటి సెరెనాను తలపిస్తూ గొప్ప షాట్లు ఆడి ఈ సెట్ తో పాటు మ్యాచ్ కూడా గెలిచింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన సెరనా.. ‘నేను సెరెనాను. నేను బాగా ఆడితే ఇలాంటి ఫలితమే వస్తుంది. కెరీర్ లో ఎంతో సాధించా. నిజాయతీగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చేదంతా బోనస్ గా భావిస్తున్నా. నేనింకా నిరూపించు కోవాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు నేను కోల్పోయేది కూడా ఏమీ లేదు. నాలో ఇంకా కొంచెం ఆట మిగిలి ఉంది అనుకుంటున్నా’ అని సెరెనా చెప్పుకొచ్చింది.