మా నాన్నగారు నన్ను కొట్టుకుంటూ థియేటర్ నుంచి ఇంటికి తీసుకుని వెళ్లారు: చిరంజీవి
- రేపు విడుదలవుతున్న 'ఫస్టు డే ఫస్టు షో'
- నిన్నరాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్
- తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్న వైనం
నిన్నరాత్రి జరిగిన 'ఫస్టు డే ఫస్టు షో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. తన జీవితంలో 'ఫస్టు డే ఫస్టు షో' అనుభవం ఒకటి ఉందంటూ చెప్పడం మొదలుపెట్టారు. "నెల్లూరులో నేను ఏడో .. ఎనిమిదో చదువుతున్నప్పుడు, రామారావుగారి 'రాము' సినిమా వచ్చింది. సాధారణంగా ఏ సినిమా వచ్చినా మా నాన్నగారు కుర్చీ టిక్కెట్టుకి తీసుకువెళుతుంటారు.
కానీ మా చుట్టాలబ్బాయి నన్ను ... నాగబాబును వెంటబెట్టుకుని ఆ సినిమాకి నేల టిక్కెట్టుకు తీసుకుని వెళ్లాడు. టిక్కెట్టు కోసం వెళ్లి నేను .. నాగబాబు క్యూ లైన్లో చిక్కుకున్నాము. ముందుకు వెళ్లలేము .. వెనక్కి రాలేము. నాగబాబు చిన్నపిల్లాడు కావడం వలన ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. అతికష్టం మీద టికెట్లు తీసుకుని బయటికి వచ్చాము.
ఇక అప్పటికే అంతకు ముందు షో చూసి బయటికి వచ్చిన మా నాన్నగారు మమ్మల్ని అక్కడ అలా చూశారు. నేల టిక్కెట్టుకు వెళతావా? అందునా ఆ చిన్న పిల్లాడిని తీసుకుని?' అంటూ అక్కడి నుంచి రోడ్డు పొడవునా నన్ను కొడుతూనే ఇంటికి తీసుకుని వెళ్లారు. అందువల్లనే ఇప్పటికీ ఎన్టీఆర్ గారి 'రాము' సినిమా పేరు చెప్పగానే నాకు వణుకు వస్తుంది" అంటూ నవ్వేశారు.