ఆసియా కప్: టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించిన హాంకాంగ్.. పంత్ ఇన్
- పాకిస్థాన్‌పై విజయంతో జోరుమీదున్న భారత్
- ఈ టోర్నీలో హాంకాంగ్‌కు ఇదే తొలి మ్యాచ్
- గతంలో ఆసియాకప్‌లలో భారత్‌పై రెండుసార్లు ఓటమి
- హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి కల్పించిన టీమిండియా
ఆసియా కప్‌లో భాగంగా మరికాసేపట్లో భారత్-హాంకాంగ్ జట్లు తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన హాంకాంగ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్ మరో మాటకు తావులేకుండా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ టోర్నీలో హాంకాంగ్‌కు ఇదే తొలి మ్యాచ్ కాగా, భారత్‌కు ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను మట్టి కరిపించిన రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కలిగిన భారత్‌ను హాంకాంగ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ రెండు జట్లు గతంలో 2008, 2018 ఆసియా కప్‌లో తలపడ్డాయి. రెండు సార్లు భారత్‌నే విజయం వరించింది. అప్పుడు ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో ఉండేది. ఇప్పుడు టీ20కి మారింది. ఈ ఫార్మాట్‌లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి. కాగా, ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి కల్పించిన భారత్.. పంత్‌కు చోటు కల్పించింది.