సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లోకి చొరబడటం సరికాదు: కేసీఆర్
- శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమన్న కేసీఆర్
- సీబీఐ ఎంట్రీని అడ్డుకున్న బీహార్‌ను అభినందించిన తెలంగాణ సీఎం
- అన్ని రాష్ట్రాలు అదే పనిచేయాలని పిలుపు
బీహార్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీరును లక్ష్యంగా చేసుకుని బుధవారం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన పోరులో ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు బీహార్ వెళ్లిన కేసీఆర్...అక్కడ అధికార కూటమి జేడీయూ, ఆర్జేడీ కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లతో జాతీయ రాజకీయాలపై కీలక చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని నరేంద్ర మోదీ సర్కారు ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై దాడులకు తెగబడుతోందని ఆయన విమర్శించారు. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమని కేసీఆర్ చెప్పుకొచ్చారు. సీబీఐ ప్రవేశాన్ని నిరాకరిస్తూ బీహార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్న కేసీఆర్.. మిగిలిన అన్ని రాష్ట్రాలు ఇదే పని చేయాలని పిలుపునిచ్చారు.