సెప్టెంబ‌ర్ 3న నాసా వ్యోమ నౌక ఆర్టెమిస్‌-1 ప్ర‌యోగం

  • ఈ నెల 29న‌నే ఆర్టెమిస్‌-1 ప్ర‌యోగానికి నాసా షెడ్యూల్‌
  • ఇంద‌న లీకేజీ కార‌ణంగా వాయిదా ప‌డిన ప్ర‌యోగం
  • నాసా చ‌రిత్ర‌లోనే అత్యంత శ‌క్తివంత‌మైన రాకెట్‌గా ఆర్టెమిస్‌-1
భార‌త్ చేప‌ట్టిన చంద్ర‌యాన్ త‌ర‌హాలో అగ్ర రాజ్యం అమెరికా అంత‌రిక్ష కేంద్రం నాసా ఓ స‌రికొత్త ప్ర‌యోగానికి తెర తీసింది. చంద్రుడిపైకి వ్యోమ నౌక‌ను పంపేందుకు ఉద్దేశించిన ఈ ప్ర‌యోగానికి ఆర్టెమిస్ పేరిట పంపేందుకు నాసా శ్రీకారం చుట్టింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం... ఈ నెల 29న‌నే ఆర్టెమిస్‌-1 ప్ర‌యోగాన్ని నాసా చేప‌ట్టాల్సి ఉంది. అయితే ఇంధన లీకేజీ కార‌ణంగా ఈ ప్ర‌యోగం వాయిదా ప‌డింది.

తాజాగా ఆర్టెమిస్‌-1లో త‌లెత్తిన ఇంధన లీకేజీని స‌రిచేసిన నాసా... త‌న ప్ర‌యోగానికి కొత్త తేదీని ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ 3న (శ‌నివారం) ఆర్టెమిస్- 1ను నింగిలోకి పంపేందుకు అమెరికా కొత్త షెడ్యూల్ ప్ర‌క‌టించింది. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో ప‌లు కీల‌క మైలు రాళ్ల‌ను అధిగ‌మించిన నాసా... త‌న చ‌రిత్ర‌లోనే అత్యంత శ‌క్తివంత‌మైన రాకెట్‌గా ఆర్టెమిస్‌-1ను తీర్చిదిద్దింది. ఈ ప్రయోగం విజ‌య‌వంత‌మైతే.. నాసా చ‌రిత్ర‌లో మ‌రో అరుదైన ఘ‌ట‌న న‌మోదైన‌ట్టే.


More Telugu News