బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షాలు... రోడ్లపైనే చేపల వేట

  • మంగళవారం నాడు బెంగళూరులో కుండపోత
  • పొంగిపొర్లిన జలాశయాలు, నగరం జలమయం
  • సామాజిక మాధ్యమాల్లో చేపల వీడియో
  • తాజా చేపలు అంటూ నెటిజన్ల సందడి
బెంగళూరు నగరం ఒక్క రోజులోనే జల విలయంలో చిక్కుకుపోయింది. మంగళవారం కురిసిన కుండపోత వానలకు నగరం దాదాపుగా జలమయమైంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వెళ్లేందుకు బోట్లు ఉపయోగించాల్సి వస్తోంది. 

తాజాగా ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై దొరికిన చేపను చేతిలో పట్టుకోగా, మరొకరు దాన్ని క్లిక్ మనిపిస్తుండడం ఫొటోలో చూడొచ్చు. తాజా చేపలు కావాలంటే ఎక్కడికో వెళ్లనవసరంలేదని, బెంగళూరు రోడ్ల మీదికి వస్తే చాలని నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. 

గత కొన్నివారాలుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 1 నుంచి 820 మిమీ వర్షపాతం నమోదైంది. దాంతో అన్ని జలాశయాలు నిండుకుండల్లా జలకళతో తొణికిసలాడుతున్నాయి. బెంగళూరు నగరంలో నిన్న ఒక్కరోజు కురిసిన వర్షంతో భారీగా వరదనీరు వచ్చి చేరింది.


More Telugu News