ఐర్లాండ్ లో ఇద్దరు కేరళ బాలుర దుర్మరణం
- స్నేహితులతో పిక్నిక్ కు వెళ్లిన వైనం
- ఈత కొట్టేందుకు సరస్సులో దిగిన విద్యార్థులు
- ఈత రాక నీటమునిగిన బాలురు
- ఇద్దరు మృతి
- మరో నలుగురిని కాపాడిన పోలీసులు
ఐర్లాండ్ లో సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు కేరళ బాలురు దుర్మరణం పాలయ్యారు. మృతులను రావెన్ సైమన్ (16), జోసెఫ్ సెబాస్టియన్ (16) గా గుర్తించారు. వీరి కుటుంబాలు కేరళను విడిచి విదేశాల్లో స్థిరపడ్డాయి. సైమన్, సెబాస్టియన్ గత సోమవారం మిత్రులతో కలిసి ఉత్తర ఐర్లాండ్ లోని ఓ సరస్సు వద్దకు పిక్నిక్ కు వెళ్లారు. ఈత కొట్టేందుకు నీటిలో దిగి మునిగిపోయారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మునిగిపోయిన బాలురను బయటికి తీశారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో మరణించగా, మరొకరు సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మరో నలుగురిని పోలీసులు కాపాడారు. ఈ విద్యార్థులు స్థానిక గ్రామర్ హైస్కూల్లో చదువుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ఉత్తర ఐర్లాండ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.