భజనతో పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చా... ఇది చెప్పింది సాక్షాత్తు ప్రధానమంత్రే: కేటీఆర్
- ప్రధాని మోదీ ప్రసంగంపై కేటీఆర్ సెటైర్
- టెలీప్రాంప్టర్ తప్పిదం అయ్యుంటుందని ఎద్దేవా
- భోజన్ బదులు భజన్ అని టైప్ చేసుంటారని వ్యంగ్యం
- ఇలాంటి హాస్యగుళికలు వద్దంటూ హితవు
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి భజన చక్కని మార్గం అని సాక్షాత్తు ప్రధానమంత్రే సెలవిచ్చారని కేటీఆర్ వెల్లడించారు. అయితే, ఇది ప్రధాని ప్రసంగంలో టెలీప్రాంప్టర్ తప్పిదం అయ్యుంటుందని తాను గట్టిగా భావిస్తున్నానని తెలిపారు.
టెలీప్రాంప్టర్ లో పొరబాటున 'భోజన్' అనే పదానికి బదులు 'భజన్' అని టైప్ అయ్యుంటుందని, అది తెలియక ప్రధాని 'భజన్' అని పలికి ఉంటాడని కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు.
భారత్ 116 దేశాలతో కూడిన ప్రపంచ ఆకలి సూచిక జాబితాలో 101వ స్థానంలో ఉందని, మనం తక్షణమే పోషకాహార లోపంపై దృష్టిపెట్టి తగిన పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు. అంతేతప్ప, ఇలాంటి హాస్య గుళికలతో సమయం వృథా చేసుకోరాదని హితవు పలికారు.