తెలంగాణలో క్రైమ్ రేటు పెరిగిందన్న వార్తలు అవాస్తవం: డీజీపీ మహేందర్ రెడ్డి
- తెలంగాణలో అత్యధిక కేసులంటూ ఎన్సీఆర్బీ రిపోర్ట్
- నేరాలు పెరిగిపోతున్నాయంటూ మీడియా కథనాలు
- అవగాహన కోసమే కేసులు నమోదు చేస్తున్నామన్న డీజీపీ
తెలంగాణలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయంటూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణలో నేరాల సంఖ్య పెరుగుతోందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ కేసులు, మానవ అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు.
రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందన్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల అవగాహన కోసమే కేసులు నమోదు చేసి అప్రమత్తం చేస్తున్నామని వివరణ ఇచ్చారు. సైబర్ క్రైమ్ కేసుల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉందని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయని, సైబర్ నేరగాళ్లు ఝార్ఖండ్, బీహార్, బెంగాల్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.