'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
- ఇంద్రగంటి నుంచి మరో విభిన్న కథా చిత్రం
- సుధీర్ బాబు జోడీగా అలరించనున్న కృతి శెట్టి
- సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్
- సెప్టెంబర్ 16వ తేదీన సినిమా విడుదల
సుధీర్ బాబుతో గతంలో రెండు సినిమాలను తెరకెక్కించిన మోహనకృష్ణ ఇంద్రగంటి, మూడో సినిమాగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రూపొందించాడు. ఈ సినిమా విడుదలకి ముస్తాబై కొంతకాలమవుతున్నా, సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. సుధీర్ బాబు జోడీగా కృతి శెట్టి నటించిన ఈ సినిమాను, సెప్టెంబర్ 16వ తేదీన విడుదల చేయనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నేపథ్యంలో కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. 'ఆ మెరుపేమిటో .. కనుపాపతో ఏమన్నదో' అంటూ ఈ పాట సాగుతోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.
తాను మనసుపడిన అమ్మాయిని తలచుకుంటూ .. ఆమె అనుభూతుల్లో హీరో తేలియాడే సందర్భంలోనిది ఈ పాట. మెలోడీనీ కొత్తగా ట్యూన్ చేసిన తీరు మరింత ఫీల్ ను తీసుకొచ్చిందనే చెప్పాలి. అటు కృతికి .. ఇటు సుధీర్ బాబుకి ఇద్దరికీ కూడా ఈ సక్సెస్ చాలా అవసరం.