సీఎం జగన్ ను కలిసిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు

  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ
  • ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ
  • పూర్తి భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి
  • ఏపీ పారిశ్రామిక విధానాలపై వివరణ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై వారు చర్చించారు. రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాలు ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. 

ఈ సందర్భంగా సీఎం జగన్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులకు భరోసానిచ్చారు. ఎలాంటి సహాయసహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏపీలో పారిశ్రామిక రంగంలో అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వారికి వివరించారు. అవసరమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 

కాగా, సీఎంను కలిసినవారిలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కార్పొరేట్ వ్యవహారాలు, రెగ్యులేటరీ విభాగం అధిపతి జె.శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీ తదితరులు ఉన్నారు. 

ఏపీ ప్రభుత్వం తరఫున ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.


More Telugu News