దూసుకుపోయిన మార్కెట్లు.. 1,564 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో మార్కెట్ల పరుగు
- 446 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3 శాతానికి పైగా పెరిగిన రియాల్టీ, బ్యాంకెక్స్, ఫైనాన్స్ సూచీలు
నిన్న భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రాకెట్ మాదిరి దూసుకుపోయాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఎక్కడా కూడా దూకుడు తగ్గించకుండా చివరి వరకు పెరుగుతూనే పోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి.
ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,564 పాయింట్లు లాభపడి 59,537కి పెరిగింది. నిఫ్టీ 446 పాయింట్లు ఎగబాకి 17,759కి చేరుకుంది. ఈ రోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి. రియాల్టీ, బ్యాంకెక్స్, ఫైనాన్స్ సూచీలు 3 శాతానికి పైగా లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ లో అన్ని కంపెనీలు లాభాల్లోనే ముగిశాయి. బజాజ్ ఫిన్ సర్వ్ (5.47%), బజాజ్ ఫైనాన్స్ (4.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.15%), టెక్ మహీంద్రా (3.96%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.72%) టాప్ గెయినర్లుగా ఉన్నాయి.