ఛలో విజయవాడ, ఛలో తాడేపల్లి కార్యక్రమాలకు అనుమతి లేదు: గుంటూరు ఎస్పీ హఫీజ్

  • సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగుల డిమాండ్
  • సీఎం జగన్ ఎన్నికల హామీ నెరవేర్చాలంటున్న ఉద్యోగులు
  • సెప్టెంబరు 1న ఛలో విజయవాడ
  • సీఎం నివాసం ముట్టడిస్తామంటున్న ఉద్యోగ సంఘాలు
ఏపీలో సీపీఎస్ రద్దు చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు సెప్టెంబరు 1న ఛలో విజయవాడ కార్యాచరణకు పిలుపునివ్వడం తెలిసిందే. తాడేపల్లిలో సీఎం నివాసం ముట్టడిస్తామని కూడా ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. లక్ష మందితో 'మిలియన్ మార్చ్' కు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో, గుంటూరు ఎస్పీ హఫీజ్ స్పందించారు. ఛలో విజయవాడ, ఛలో తాడేపల్లి కార్యక్రమాలకు అనుమతిలేదని స్పష్టం చేశారు. ఆందోళనలో పాల్గొనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 2 వేల మందికి నోటీసులు ఇచ్చామని ఎస్పీ తెలిపారు. విజయవాడ, తాడేపల్లిలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని వివరించారు.


More Telugu News