కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ ఢిల్లీలో తలవంచారు: సీపీఐ రామకృష్ణ
- ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడంలేదన్న రామకృష్ణ
- కేంద్రాన్ని జగన్ నిలదీయడంలేదని విమర్శ
- జగన్ విధానాలతో ఏపీ దివాలా తీస్తోందని వ్యాఖ్య
- వరుసగా మూడో ఏడాది సీపీఐ కార్యదర్శిగా రామకృష్ణ ఎన్నిక
సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ కేంద్రంపైనా, సీఎం జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడంలేదని ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని పేర్కొన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ ఢిల్లీలో తలవంచారని రామకృష్ణ విమర్శించారు. ఏపీ ప్రయోజనాలపై కేంద్రాన్ని జగన్ నిలదీయడంలేదని అన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ఏపీ ఆర్థికంగా దివాలా తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ మరోసారి ఏకగ్రీవం అయ్యారు. ఆయన ఏపీ కార్యదర్శిగా ఎన్నిక కావడం వరుసగా మూడోసారి. విశాఖలో జరిగిన 27వ సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నిక జరిపారు. ఇక సీపీఐ ఏపీ సహాయక కార్యదర్శులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి మరోసారి ఎన్నికయ్యారు.