ఫ్రీజర్ లో ఈ ఆహార పదార్థాలు పెట్టకూడదు!
- కొన్ని పదార్థాలు ఫ్రీజర్ లో వాటి గుణాన్ని కోల్పోతాయి
- పూర్తిగా పండని పండ్లను బయటే ఉంచేయాలి
- టమాటాలను కూడా బయటే పెట్టి వాడుకోవాలి
- అలా చేయడం వల్ల మంచి రుచి
నేడు టీవీ, ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. మరీ పేదలు మినహాయిస్తే దాదాపు అందరి ఇళ్లల్లో రిఫ్రిజిరేటర్ దర్శనమిస్తుంది. ఒకప్పుడు కేవలం మంచి నీరు, కూరగాయలకే రిఫ్రిజిటేర్ పరిమితయ్యేది. కానీ కాలక్రమంలో అన్ని రకాల ఆహార పదార్థాలు, పండ్లను తీసుకెళ్లి ఫ్రీజర్ లో పెట్టేసే ధోరణి పెరిగిపోయింది. నిజానికి ఫ్రిడ్జ్ వినియోగం గురించి తెలిసింది తక్కువ మందికే. ఫ్రీజర్ లో కొన్ని రకాల పదార్థాలను పెట్టకూడదు. పాడైపోకుండా ఉండాలని ప్రతిదీ తీసుకెళ్లి శీతల బాక్స్ లో పెట్టేయడం సరికాదు.
గుడ్లు
రిఫ్రిజిరేటర్లో గుడ్లను పెడుతుంటారు. గుడ్డులోని సొన ఘనీభవించిన తర్వాత దాని పరిమాణం విస్తరిస్తుంది. దీంతో అన్ని సందర్భాల్లో కాకపోయినా, కొన్ని సార్లు గుడ్డుపై పెంకు క్రాక్ ఇస్తుంది. దాంతో అది కలుషితం కావచ్చు. అందుకని గుడ్లను ప్రిజ్డ్ లో పెట్టి తీసుకునే సమయంలో పరీక్షించి చూడాలి. మంచిగా ఉంటే వాడుకోవచ్చు. క్రాక్ ఇస్తే దాన్ని వాడకూడదు.
మాంసం
ఫ్రిజ్ లో ఒకసారి స్టోర్ చేసిన మాంసాన్ని బయటకు తీసి కొద్ది సేపు ఉంచిన తర్వాత, తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ మరలా రిఫ్రిజిరేటర్ లో పెట్టొద్దు. దాని టెక్స్చర్ మారిపోతుంది. దీనికి బదులు కావాల్సినంతే బయటకు తీసుకోవాలి.
పండ్లు, కూరగాయలు
నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోస, దోస, పుచ్చకాయ వంటివి రిఫ్రిజిరేటర్ లో పెట్టారనుకోండి. వాటిల్లో నీరు ఘనీభవిస్తుంది. బయటకు తీసి అలా కొద్దిసేపు ఉంచితే ఇవి తడిగా మారిపోతాయి. తినడానికి అంతగా బాగోవు. పుచ్చకాయను గది ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు అది ఇంకా పండాల్సి ఉంటే ఆ ప్రకియ కొనసాగేందుకు వీలుంటుంది.
బంగాళాదుంపలను కూడా ఫ్రీజర్ లో పెట్టకూడదు. ఎందుకంటే వీటిల్లోనూ తేమ శాతం తగినంత ఉంటుంది. వాటిని బయట పెట్టినా చాలా రోజుల పాటు నిల్వ, రుచితో ఉంటాయి. టమాటాలను గదిలో ఉంచినప్పుడు అవి పండుతూనే ఉంటాయి. దాంతో రుచి పెరుగుతుంది. రిఫ్రిజిరేటర్ లో పెట్టేశారంటే ఆ పండే గుణం ఆగిపోతుంది. దాంతో వాటి అసలు రుచి తెలియదు. ఫ్రిడ్జ్ లో పెట్టకుండా టమాటాలను ఒకసారి వండుకుని రుచి చూడండి.
వేయించిన పదార్థాలు
వేయించిన ఆహార పదార్థాలు, ఉడికించిన రైస్ ను కూడా రిఫ్రిజిరేటర్ లో పెట్టకూడదు. దీనికి బదులు వీటిని ఓవెన్ లో వేడి చేసుకుని ఉపయోగించుకోవచ్చు.
తేనె
తేనెలో చక్కెరలు ఎక్కువ. పైగా ఇది సహజ ప్రిజర్వేటివ్. కనుక దీనికి రిఫ్రిజిరేషన్ అవసరం లేదు. తేనెను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అది గట్టి పడి, రాయిగా మారుతుంది.
కాఫీ
కాఫీ గింజలను కూడా పెట్టకూడదు. దీని ఫ్లావర్ ఇతర పదార్థాలకు వ్యాపిస్తుంది. ఆరోమాటిక్ గుణం తగ్గిపోతుంది.
చాక్లెట్లు
మనలో చాలా మంది చాక్లెట్లను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు. ఓపెన్ చేయనివి పెట్టొచ్చు. కానీ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత వాటిని బయటే ఉంచి వీలైనంత తొందరగా తినేయడమే మంచిది. అంతేకానీ రిఫ్రిజిరేటర్ లో పెడితే కంటామినేషన్ అవుతాయి.
ఇంకా ఆనియన్స్, బ్రెడ్, అవకాడో, స్ట్రాబెర్రీ, వెల్లుల్లి రెబ్బలు, మూత తెరిచిన ఫుడ్ క్యాన్లు, గుమ్మడి కాయలు, యాపిల్, పండని మామిడి కాయలు, పీచ్ పండ్లను, తులసి ఆకులను కూడా రిఫ్రిజిరేటర్ లో పెట్టకూడదు.