హార్ధిక్ పాండ్యా ముగింపు అదిరింది: పాక్ కెప్టెన్ అజామ్
- బ్యాటింగ్, బౌలింగ్ గొప్పగా చేశాడన్న అజామ్
- గొప్ప ఆల్ రౌండర్ అంటూ కితాబు
- ఒంటి చేత్తో గెలిపించిన పాండ్యా
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ భారత జట్టు ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఆటను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. ఆసియాకప్ 2022లో భాగంగా ఆదివారం భారత్-పాక్ జట్లు తలపడడం తెలిసిందే. భారత జట్టును గెలిపించే విధంగా ఆడిన పాండ్యాను మ్యాచ్ అనంతరం బాబర్ మెచ్చుకున్నాడు.
‘‘హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ చాలా గొప్పగా చేశాడు. అతడు గొప్ప ఆల్ రౌండర్. ఆటను ముగించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది’’ అని బాబర్ మీడియాతో అన్నాడు. చివరి ఓవర్ కు 7 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ ఉంది. కానీ, మొదటి మూడు బంతుల్లో ఒక వికెట్ కోల్పోయి, కేవలం ఒక పరుగే రాబట్టింది. దీంతో మరో మూడు బంతులకు ఆరు పరుగులు చేయాలి. ఆ సమయంలో హర్థిక్ పాండ్యా బలంగా బాల్ ను లాంగాన్ మీదుగా స్టాండ్స్ లోకి పంపించడంతో భారత్ విజయం ఖరారైంది.
నిన్నటి మ్యాచ్ విజయం పూర్తిగా హార్దిక్ పాండ్యా మ్యాజిక్ వల్లేనని చెప్పుకోవాలి. తొలుత బౌలింగ్ లో మూడు వికెట్లు తీయడమే కాకుండా.. బ్యాటింగ్ లో 17 బంతులకు 33 పరుగులు రాబట్టాడు.