ప్లాస్టిక్ ఫ్లెక్సీల మీద నిషేధం పవన్ కల్యాణ్ పుట్టినరోజు వరకు అమల్లో ఉండి ఆ తర్వాత మాయమవుతుందా?: అనిత
- ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించిన సీఎం జగన్
- గతంలో సినిమా టికెట్ రేట్ల వ్యవహారంతో పోల్చిన అనిత
- పవన్ సినిమా విడుదల వరకు తగ్గిన రేట్లు తర్వాత పెరిగాయని వెల్లడి
- ఏపీలో ముందు జగన్ ను నిషేధించాలని పిలుపు
ఇటీవల సీఎం జగన్ ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం ప్రకటించడం తెలిసిందే. 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చాలనేది తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. దీనిపై టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శనాత్మకంగా స్పందించారు.
ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలానే అవుతుందా? అంటూ ట్వీట్ చేశారు. గతంలో పవన్ కల్యాణ్ సినిమా విడుదల వరకు తగ్గిన సినిమా టికెట్ రేట్లు, ఆ తర్వాత మళ్లీ పెరిగినట్టు... ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద నిషేధం కూడా పవన్ కల్యాణ్ పుట్టినరోజు వరకు ఉండి ఆ తర్వాత మాయమవుతుందా? అంటూ అనిత సందేహం వ్యక్తం చేశారు. అంతకుముందు మరో ట్వీట్ లో... రాష్ట్రంలో ప్లాస్టిక్ కంటే ముందు జగన్ ను బ్యాన్ చేయాలని, లేదంటే ఏపీనే బ్యాన్ అయ్యే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.
కాగా, జనసేనాని పవన్ కల్యాణ్ సెప్టెంబరు 2న పుట్టినరోజు జరుపుకోనున్నారు.