దృశ్యం మూడో పార్టు వస్తోంది
- ప్రకటించిన నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్
- మూడో పార్టు కాన్సెప్ట్ విని ఓకే చెప్పిన మోహన్ లాల్
- తొలి రెండు పార్టులకు మంచి ఆదరణ
- తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసిన వెంకటేష్
భారత సినీ పరిశ్రమలో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ చిత్రాల కొనసాగింపుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కథ, కథనం బాగున్న వాటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన క్రైమ్-థ్రిల్లర్ ‘దృశ్యం’ రెండు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ చిత్రం మూడవ భాగంతో తిరిగి వస్తుందని నిర్మాత ఆంటోని పెరుంబవూర్ ఒక అవార్డుల కార్యక్రమంలో ప్రకటించారు. ట్రేడ్ ఎక్స్‌పర్ట్ మనోబాల విజయబాలన్ కూడా ఈ వార్తను ధృవీకరించారు. మూడో పార్టు కాన్సెప్ట్ లైన్ ను మోహన్ లాల్‌కు చెప్పగా ఆయనకు నచ్చిందని తెలుస్తోంది. దాంతో, మరో సీక్వెల్ కు ఆయన పచ్చజెండా ఊపారని సమాచారం. ప్రస్తుత సమచారం ప్రకారం, ‘దృశ్యం 3’ 2023 చివర్లో లేదా 2024లో విడుదల అవుతుంది.
‘దృశ్యం’ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం హిందీతో సహా మరో నాలుగు భాషల్లోకి రీమేక్ అయి సక్సెస్ సాధించింది. హిందీ రీమేక్ లో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో కనిపించారు. కన్నడలో వి. రవిచంద్రన్ నటించగా.. తెలుగులో వెంకటేష్ నటించిన రెండు పార్టులూ ప్రేక్షకులను అలరించాయి. తమిళంలో కమల్ హాసన్ నటించారు. కాగా, మూడో పార్టుకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు తెలియాల్సి ఉంది. ‘దృశ్యం 3’ మాతృక వస్తే.. తెలుగులో వెంకటేష్ హీరోగా దీన్ని రీమేక్ చేసే అవకాశాలు లేకపోలేదు.