రేపే రిలయన్స్ ఏజీఎం... అందరి దృష్టి ముఖేశ్ అంబానీ ప్రసంగంపైనే
- రేపు రిలయన్స్ 45వ ఏజీఎం
- ముంబై వేదికగా వాటాదారులతో ముఖేశ్ సమావేశం
- 5జీ సేవలపై ముఖేశ్ కీలక ప్రకటన చేసే అవకాశం
భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రేపు (సోమవారం) తన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) నిర్వహిస్తోంది. మొత్తం తన వాటాదారులందరినీ పిలిచి ముంబై వేదికగా అట్టహాసంగా నిర్వహిస్తున్న ఏజీఎంలలోనే ఆ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ తన కంపెనీకి సంబంధించిన కొత్త వ్యూహాలు, పెట్టుబడులు, భాగస్వామ్యాలను ప్రకటిస్తూ ఉంటారు. రిలయన్స్‌కు సంబంధించిన ఏ కీలక నిర్ణయమైనా కూడా ఏజీఎం ద్వారానే వెల్లడి అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రేపు జరగనున్న రిలయన్స్ 45వ ఏజీఎంపై అందరి దృష్టి పడింది. ప్రత్యేకించి ఏజీఎంలో ముఖేశ్ అంబానీ ఎలాంటి వ్యూహాలు ప్రకటిస్తారన్న విషయంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో టెలికాం రంగంలో మేటిగా నిలవాలన్న లక్ష్యంతో సాగుతున్న రిలయన్స్.. 5జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశమున్నట్లుగా సమాచారం. అదే తరహాలో కొత్త రంగాల్లోకి రిలయన్స్ ప్రవేశంపైనా ముఖేశ్ కీలక ప్రకటనలు చేయవచ్చన్న వాదనలు వినిసిస్తున్నాయి.