పోప్‌కు కార్డినల్‌గా ఎన్నికైన తొలి తెలుగు బిషప్ పూల ఆంథోనీ
- ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన పూల ఆంథోనీ
- 2008లో కర్నూలు డయాసిస్ బిషప్‌గా ఎంపిక
- ప్రస్తుతం హైదరాబాద్ ఆర్చ్ బిషప్‌గా వ్యవహరిస్తున్న వైనం
హైదరాబాద్ ఆర్చ్ బిషప్‌గా వ్యవహరిస్తున్న పూల ఆంథోనీ తాజాగా ఓ అరుదైన గుర్తింపును సంపాదించారు. పోప్ ఫ్రాన్సిస్‌కు కార్డినల్‌గా ఎన్నికైన తొలి తెలుగు బిషప్‌గా ఆయన రికార్డులకు ఎక్కారు. ఈ మేరకు వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో శనివారం జరిగిన వేడుకలో పోప్ కార్డినల్‌గా పూల ఆంథోనీ బాధ్యతలు స్వీకరించారు. కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకను వీక్షించేందుకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవ ప్రముఖులు వాటికన్ సిటీకి వెళ్లారు.
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన పూల ఆంథోనీ... 1992లో మత గురువుగా బాధ్యతలు చేపట్టారు. రోమన్ కథోలిక్స్‌కు సంబంధించి కర్నూలు డయాసిస్‌కు బిషప్‌గా ఆయన 2008లో బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల రోమన్ కథోలిక్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆంథోనీ.. తాజాగా పోప్ కార్డినల్‌గా ఎంపిక కావడం గమనార్హం. ఆయా వ్యవహారాల్లో పోప్‌కు సలహాలు, సూచనలు అందజేసేందుకు నియమితులయ్యే వారినే కార్డినల్స్ అంటారు.