కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతివ్వండి... తెలంగాణ సీఎస్‌కు బండి సంజయ్ లేఖ
- 30 మంది ప్రతినిధి బృందంతో ప్రాజెక్టును సందర్శిస్తామన్న సంజయ్
- సెప్టెంబర్ తొలి వారంలో సందర్శించాలనుకుంటున్నట్లు వెల్లడి
- ప్రాజెక్టుపై అనుమానాలను నివృత్తి చేసుకోవడమే సందర్శన లక్ష్యమని వివరణ
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలనుకుంటున్నామని, అందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, సాగునీటి పారుదల రంగం నిపుణులతో కూడిన 30 మంది ప్రతినిధి బృందం ప్రాజెక్టును సందర్శించాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ తొలి వారంలో ప్రాజెక్టును సందర్శించాలనుకుంటున్నట్లుగా కూడా తన లేఖలో బండి సంజయ్ తెలిపారు.
కాశేళ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు వరదల్లో ప్రాజెక్టు మునకపైనా పరిశీలన జరపాలని అనుకుంటున్నామని సంజయ్ తెలిపారు. ఈ పరిశీలన ద్వారా ప్రాజెక్టుపై తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. 1998లో వచ్చిన వరదల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు టర్బైన్లు దెబ్బ తిన్న సందర్భంలో వాటిని పరిశీలించేందుకు అప్పటి ప్రభుత్వం విపక్షాలకు అనుమతి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. తమ బృందంతో పాటు ప్రభుత్వ సాగునీటి శాఖ అధికారులను పంపి తమ అనుమానాలను నివృత్తి చేయాలని కూడా ఆయన సీఎస్‌ను కోరారు.