కరోనా నుంచి కోలుకున్న ద్రవిడ్... దుబాయిలో భారత జట్టుతో చేరిన హెడ్ కోచ్
- ఇటీవలే కరోనా బారిన పడిన ద్రవిడ్
- బోర్డు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న వైనం
- కరోనా నుంచి కోలుకున్న హెడ్ కోచ్
- శనివారం రాత్రే దుబాయి చేరిన వైనం
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ ప్రారంభానికి ముందు కరోనా బారిన పడ్డ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఈ మొత్తం సిరీస్‌కే దూరమవుతారని అంతా భావించారు. అసలే ఆసియా కప్, ఆపై దాయాదీ పాకిస్తాన్‌తో మ్యాచ్... ఇలాంటి కీలక సమయంలో హెడ్ కోచ్ లేకుండానే భారత జట్టు రంగంలోకి దిగాల్సి రావడం పలువురిని కలవరపాటుకు గురి చేసింది. అయితే అలాంటి ఇబ్బందేమీ లేకుండా ద్రవిడ్ స్థానంలో అతడి సమకాలీకుడు వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా బీసీసీఐ పంపింది.
అయితే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ద్రవిడ్... శనివారం రాత్రే దుబాయి చేరుకున్నాడు. జట్టు సభ్యులతో అతడు కలిసిపోయాడు. పాక్‌తో కీలక మ్యాచ్‌కు ఓ రోజు ముందుగానే అతడు జట్టుకు అందుబాటులోకి రావడం శుభ పరిణామంగానే భావిస్తున్నారు. కరోనా బారిన పడిన ద్రవిడ్ బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. ఈ చికిత్సతో త్వరగానే కరోనా నుంచి కోలుకున్న ద్రవిడ్... తిరిగి జట్టుకు తన సేవలు అందించేందుకు రంగంలోకి దిగడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.