నేడే ఆసియా కప్‌లో హై ఓల్టేజీ మ్యాచ్... రాత్రి 7.30 గంటలకు భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్
- ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా 14 మ్యాచ్‌లు
- 8 విజయాలతో ఫేవరేట్‌గా భారత జట్టు
- 5 విజయాలు మాత్రమే నమోదు చేసిన పాక్
అంతర్జాతీయ క్రికెట్‌లో కీలక టోర్నమెంట్ పరిగణిస్తున్న ఆసియా కప్ శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో రెండో రోజైన ఆదివారం హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు, దాయాదీ దేశాలు అయిన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆదివారం రాత్రి 7.30 గంటలకు జరగనుంది. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఆసియా కప్‌లో ఇప్పటిదాకా భారత్, పాక్ జట్ల మధ్య 14 మ్యాచ్‌లు జరగగా... వాటిలో 8 మ్యాచ్‌లలో భారత్ గెలిచింది. పాక్ ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్ లో వర్షం వల్ల ఫలితం రాలేదు. వెరసి ఆసియా కప్‌లో పాక్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. ఆసియా కప్‌లో జరిగిన చివరి మూడు మ్యాచ్‌లలోనూ పాక్‌పై భారతే విజయం సాధించింది. ఓవరాల్ రికార్డ్‌లో భారతే ఫేవరేట్‌గా ఉన్న నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో కూడా భారతే ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.