వెలవెలబోతున్న లైగర్.. పడిపోయిన కలెక్షన్లు
- మొదటి రెండు రోజులు ఆదాయం ఫర్వాలేదు
- మూడో రోజుకు వచ్చే సరికి రూ.7.5 కోట్లకు పరిమితం
- ఇక వసూళ్లు పెరగడం సందేహమేనన్న అభిప్రాయం
బాక్సాఫీసు ముందు లైగర్ సినిమా వెలవెలబోతోంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా అభిమానులను నిరాశరపరచడం తెలిసిందే. ఈ నెల 25న లైగర్ సినిమా విడుదలైంది. మొదటి రోజు 33.12 కోట్లను ఈ సినిమా వసూలు చేసుకోగలిగింది. రెండో రోజుకు వచ్చే సరికి కలెక్షన్లు రూ.27 కోట్లకు తగ్గాయి. ఇక ముచ్చటగా మూడో రోజు కేవలం రూ.7.5 కోట్లనే వసూలు చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా లైగర్ సినిమా విడుదల కాగా.. హిందీ వెర్షన్ మాత్రం ఆగిపోయింది. లైగర్ కు దాదాపు అందరూ చెత్త రేటింగ్ ఇస్తున్నారు. సానుకూల రివ్యూలు లేనే లేవు. దీంతో థియేటర్లకు వచ్చేవారు కరువయ్యారు. ఇది వసూళ్లపై ప్రభావం చూపిస్తోంది. ఈ పరిణామాలతో హిందీ వెర్షన్ లైగర్ ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్యపాండే, మైక్ టైసన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా ఉండడం తెలిసిందే. కథనం, స్క్రీన్ ప్లే, పాత్రలు మెప్పించేవిగా లేకపోవడం సినిమాకు పెద్ద డ్రాబ్యాక్ గా తెలుస్తోంది. సినిమా వసూళ్లు ఇక పుంజుకోకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.