ఉద‌యం నుంచి రాత్రి దాకా!... రోజంతా రైతుల‌తోనే కేసీఆర్ భేటీ!

  • 20 రాష్ట్రాల నుంచి వ‌చ్చిన రైతులు
  • ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా రైతుల‌తో స‌మావేశం
  • రేపు కూడా కొన‌సాగ‌నున్న స‌మావేశం
తెలంగాణ సీఎం కేసీఆర్ శ‌నివారం ఓ వినూత్న స‌మావేశాన్ని నిర్వ‌హించారు. దేశం న‌లుమూల‌ల నుంచి... దాదాపుగా 20 రాష్ట్రాల నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన రైతుల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. ఈ భేటీ ఉద‌యం నుంచి రాత్రి దాకా కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం. ప్రగ‌తి భ‌వ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఈ స‌మావేశంలో రైతుల‌తో కేసీఆర్ ఉత్సాహంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఆయా రాష్ట్రాల్లో వ్య‌వ‌సాయ ప‌రిస్థితులు, ప‌ద్ద‌తులు, ఆయా ప్ర‌భుత్వాల నుంచి అందుతున్న మ‌ద్ద‌తు, సాగులో నూత‌నంగా అందివ‌స్తున్న సాంకేతికత త‌దిత‌రాల‌పై కేసీఆర్ చ‌ర్చించారు. 

ప‌నిలో ప‌నిగా తెలంగాణ‌లో త‌మ ప్ర‌భుత్వం రైతుల‌కు అందిస్తున్న మ‌ద్ద‌తును కూడా కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రైతన్న‌ల‌కు పూర్తిగా ఉచిత విద్యుత్ అందిస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా రైతు బంధు పేరిట దేశంలోనే రైతుల‌కు ప్ర‌భుత్వం నుంచి తొలిసారిగా పెట్టుబ‌డి సాయాన్ని అందించిన ప్ర‌భుత్వంగా త‌మ‌కు ద‌క్కిన గుర్తింపును కేసీఆర్ వివ‌రించారు. ఇదిలా ఉంటే... శ‌నివారం స‌మావేశానికి హాజ‌రైన రైతుల‌తో కేసీఆర్ ఆదివారం కూడా స‌మావేశం కానున్నారు.


More Telugu News