జేపీ నడ్డాతో భేటీ అయిన నితిన్... భేటీకి హాజరైన ఎంపీ లక్ష్మణ్
- శంషాబాద్ నోవాటెల్‌కు వచ్చిన నితిన్
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ
- రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న సమావేశం
తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో శనివారం రాత్రి టాలీవుడ్ యువ హీరో నితిన్ భేటీ అయ్యారు. బీజేపీ నేతల ఆహ్వానం మేరకే శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు వెళ్లిన నితిన్... నడ్దాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావులు సైతం పాలుపంచుకున్నారు.
ఏ అంశాల ప్రాతిపదికగా ఈ భేటీ జరుగుతోందన్న విషయం వెల్లడి కానప్పటికీ... తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిశీలకులు ఈ భేటీపై అమితాసక్తి కనబరుస్తున్నారు. గత ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ ముగిసిన వారం వ్యవధిలోనే జేపీ పడ్డా మరో టాలీవుడ్ హీరోతో భేటీ అంటే ఆసక్తి రేకెత్తించేదే కదా.