లావాపై మనుషులు పడితే ఎలా ఉంటుందో చూద్దామని ప్రయోగం.. పేలడం మొదలెట్టిన అగ్నిపర్వతం.. వీడియో ఇదిగో!
- ప్రయోగాత్మకంగా జీవ వ్యర్థాలను విసిరేసిన పరిశోధకులు
- అగ్నిపర్వతంలో మనుషులు, ఇతర పెద్ద జీవులు పడితే ఎలా ఉంటుందనే పరిశీలన
- వ్యర్థాలు పడిన సెకన్లలోనే భారీ స్థాయిలో లావా వెలువడిన వైనం
- ప్రయోగం పాతదే అయినా.. తాజాగా వైరల్ అవుతున్న వీడియో
అది యాక్టివ్ గా ఉన్న అగ్ని పర్వతం.. ఇద్దరు వ్యక్తులు దాని బిలానికి పై నిలబడి చూస్తున్నారు. కాసేపటికి ఏదో బరువైన వస్తువును అగ్నిపర్వతంలోకి విసిరేశారు. అది వెళ్లి ప్రశాంతంగా ఉన్న లావామీద పడింది. ఒక్కసారిగా రియాక్షన్ మొదలై లావా వెదజల్లడం మొదలైంది. కాసేపటికే కణకణమంటూ భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతాన్ని ఇలా రెచ్చగొట్టడం ఓ పరిశోధనలో భాగంగా జరిగింది. ఇది ఎప్పటిదో పాత ఘటనే అయినా తాజాగా వైరల్ గా మారింది.
మనుషులు పడితే ఎలా ఉంటుందో చూద్దామని..
మనుషులు పడితే ఎలా ఉంటుందో చూద్దామని..
- యాక్టివ్ గా ఉన్న అగ్ని పర్వతంలో మనుషులు పడితే ఎలా ఉంటుందోనన్న దానిపై ఇథియోపియాలోని ఎర్టా అలె అగ్ని పర్వతం వద్ద కొందరు పరిశోధకులు ప్రయోగం చేశారు.
- అయితే నేరుగా మనుషులను పడేయలేరు గనుక.. సుమారు 30 కిలోల బరువైన జంతు, జీవ వ్యర్థాలను మూటగట్టుకుని వెళ్లి ఎర్టా అలె అగ్నిపర్వతంలోకి విసిరేశారు.
- అగ్నిపర్వతానికి మరోవైపున ఉన్న మరికొందరు పరిశోధకులు దీనిని వీడియో తీశారు.
- పరిశోధకులు విసిరేసిన మూట నేరుగా వెళ్లి లావాపై పడింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతం.. ఒక్కసారిగా పేలడం మొదలు పెట్టింది. కాసేపట్లోనే భారీగా లావాను వెదజల్లింది.
- జీవ వ్యర్థాల్లో 90 శాతం వరకు నీరే ఉంటుందని.. అత్యంత వేడిగా ఉన్న లావాలో జీవ వ్యర్థాలు పడటంతో.. అందులోని నీరు ఒక్కసారిగా ఆవిరై పేలుడు సృష్టించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కదలిక వల్ల అగ్ని పర్వతం యాక్టివ్ గా మారిందని అంటున్నారు.
- అయితే ఎవరైనా పొరపాటున కూడా ఇలా అగ్నిపర్వతాల వద్దకు వెళ్లవద్దని.. తాము అన్ని రకాల రక్షణ పరికరాలు ధరించే వెళ్లామని హెచ్చరించారు.
- నిజానికి ఈ వీడియో దాదాపు పదేళ్ల కిందట తీసినదే. కానీ ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మరింది. యూట్యూబ్ లో అయితే రెండు కోట్ల మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు. వేల కొద్దీ లైక్ లు వచ్చాయి.