గుప్త విరాళాలు బీజేపీ కంటే కాంగ్రెస్‌కే అధికం... ప్రాంతీయ పార్టీల్లో టాప్‌లో వైసీపీ
- గుప్త నిధులుగా పార్టీలు అందుకున్న విరాళాల విలువ రూ.15,077 కోట్లు
- వీటిలో గతేడాది మాత్రమే అందిన విరాళాలు రూ. 690.67 కోట్లు
- బీజేపీకి రూ.100.50 కోట్లు అందితే... కాంగ్రెస్‌కు రూ.178.78 కోట్లు అందిన వైనం
- రూ.96.25 కోట్లతో ప్రాంతీయ పార్టీల్లో అగ్రస్థానంలో నిలిచిన వైసీపీ
- ఆప్‌కు గుప్త నిధుల ద్వారా అందిన మొత్తం రూ.5.4 కోట్లు
దేశంలో రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాల్లో మెజారిటీ విరాళాలు గుర్తు తెలియని మూలాల (గుప్త) నుంచి వస్తున్నవే. విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న వివరాలను ఆయా రాజకీయ పార్టీలు వెల్లడించకున్నా... ఏ మేర వచ్చాయన్న విషయాన్ని మాత్రం వెల్లడించక తప్పదు. అన్ని మార్గాల్లో ఆయా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏటా విడుదల చేస్తూనే ఉంటుంది. ఆ విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ ఏటా విశ్లేషిస్తూనే ఉంటుంది.
తాజాగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆయా పార్టీలకు వచ్చిన విరాళాల మీద ఏడీఆర్ శుక్రవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రాజకీయ పార్టీలకు 2004-05 నుంచి 2020-21 మధ్య కాలంలో గుర్తు తెలియని మూలాల నుంచి ఏకంగా రూ.15,077 కోట్లు అందాయి. వీటిలో 2020-21 ఒక్క ఏడాదిలోనే ఈ తరహా నిధులను జాతీయ, ప్రాంతీయ పార్టీలు రూ.690.67 కోట్లు అందుకున్నాయి. ఈ నిధులు అందుకున్న పార్టీల్లో 8 జాతీయ పార్టీలు కాగా... 27 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.
ఇక వీటిలో 8 జాతీయ పార్టీలకు అందిన మొత్తం రూ.426.74 కోట్లు కాగా... 27 ప్రాంతీయ పార్టీలకు 263.92 కోట్లు అందాయి. జాతీయ పార్టీల్లో అధికార పార్టీగా ఉన్న బీజేపీకి ఈ తరహా నిధుల్లో రూ.100.50 కోట్లు అందగా... విపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు దాని కంటే అధికంగా రూ.178.78 కోట్లు అందాయట.
ఇక గుప్త విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే... ఈ విరాళాలు అందుకున్న పార్టీల సంఖ్య 27గా ఉన్నా... వాటిలో 5 పార్టీలకే మెజారిటీ నిధులు అందినట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇలాంటి నిధులను అత్యధికంగా అందుకున్న పార్టీగా... ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నిలిచింది. ఈ పార్టీ గతేడాది గుప్త విరాళాలుగా 96.25 కోట్లను అందుకుంది. ఆ తర్వాత తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే రూ.80.02 కోట్లతో రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో రూ.67 కోట్లతో బీజేడీ మూడో స్థానంలో నిలవగా. రూ.5.77 కోట్లతో ఎంఎన్ఎస్, రూ.5.4 కోట్లతో ఆప్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.