ఓఎంసీ, గాలి జ‌నార్దన్ రెడ్డి కేసు కోసం ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి: సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

  • అక్ర‌మ మైనింగ్‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి
  • ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటుపై రిజిస్ట్రీకి ధ‌ర్మాస‌నం ఆదేశం
  • నూత‌న సీజేఐ ఆదేశానుసారం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచ‌న‌
అక్ర‌మ మైనింగ్‌లో కీల‌క ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి, ఆయ‌న నేతృత్వంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)ల కేసుపై సుప్రీంకోర్టు శుక్ర‌వారం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల విచార‌ణ కోసం ప్ర‌త్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాసనం శుక్ర‌వారం కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

ఓఎంసీ, గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కేసుల విచార‌ణ కోసం ప్ర‌త్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాల‌ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సీజేఐ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా త్వ‌ర‌లో సీజేఐగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న జ‌స్టిస్ ల‌లిత్ ఆదేశానుసారం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించింది. 

శుక్ర‌వారంతో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సీజేఐగా ప‌దవీ విర‌మ‌ణ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. రేపు జ‌స్టిస్ ల‌లిత్ నూత‌న సీజేఐగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ నేప‌థ్యంలో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కేసు విచార‌ణ‌కు రావ‌డం, దానిపై ప్ర‌త్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాల‌ని కోర్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం.


More Telugu News