'ఒకే ఒక జీవితం' నుంచి సాంగ్ రిలీజ్!
- విభిన్న కథా చిత్రంగా 'ఒకే ఒక జీవితం'
- శర్వానంద్ సరసన నాయికగా రీతూ వర్మ
- కీలకమైన పాత్రలో అమల అక్కినేని
- వచ్చే నెల 9వ తేదీన సినిమా రిలీజ్
శర్వానంద్ .. రీతూ వర్మ .. అమల ప్రధానమైన పాత్రలుగా 'ఒకే ఒక జీవితం' సినిమాను రూపొందించారు. ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకత్వం వహించాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు.
కృష్ణ చైతన్య సాహిత్యాన్ని అందించిన ఈ పాటను హీరో కార్తి ఆలపించడం విశేషం. ఆయనపైనే ఈ పాటను చిత్రీకరించడం మరో విశేషం. హీరో .. హీరోయిన్ .. అమల మచ్చుకి అలా కనిపిస్తారంతే. 'మారిపోయే లోకమంతా' అంటూ ఈ పాట సాగుతుంది. టెక్నాలజీలో వచ్చిన మార్పును ప్రధానంగా చేసుకుని ఈ పాట నడుస్తుంది.
ఈమధ్య రామ్ సినిమాలో శింబు ఒక పాట పాడాడు. ఇప్పుడు శర్వా సినిమాలో కార్తి పాడాడు. చూస్తుంటే ఇదో కొత్త ట్రెండ్ కి దారితీస్తున్నట్టుగా అనిపిస్తోంది. శర్వానంద్ - రీతూ ఇద్దరూ కూడా ఫ్లాపులలోనే ఉన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా. వాళ్ల కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.