ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ముగించిన మార్కెట్లు
- 59 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 36 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2.80 శాతం పెరిగిన ఎన్టీపీసీ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప లాభాల్లో ముగించాయి. ఈ ఉదయం ఉత్సాహంగానే ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే అంతర్జాతీయ సానుకూల సంకేతాలు మార్కెట్లకు అండగా నిలిచాయి.
ఈ క్రమంలో చివర్లో మళ్లీ కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 58,834కి చేరుకుంది. నిప్టీ 36 పాయింట్లు పెరిగి 17,559 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.80%), టైటాన్ (2.65%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.92%), కోటక్ బ్యాంక్ (1.71%), ఎల్ అండ్ టీ (1.47%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.92%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.20%), ఏసియన్ పెయింట్స్ (-1.18%), భారతి ఎయిర్ టెల్ (-1.02%), డాక్టర్ రెడ్డీస్ (-0.45%).