విశాఖ తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసిన ఏపీ మంత్రులు... ఫొటోలు ఇవిగో!

  • విశాఖలో సాగర తీర స్వచ్ఛత కార్యక్రమం
  • హాజరైన ఆదిమూలపు సురేశ్, గుడివాడ అమర్ నాథ్
  • కాళీమాత ఆలయం వద్ద చెత్త తొలగింపు
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హెలికాప్టర్ ప్రదర్శన
విశాఖపట్నంలో నిర్వహించిన సాగర తీర స్వచ్ఛత కార్యక్రమంలో ఏపీ మంత్రులు ఆదిమూలపు సురేశ్, గుడివాడ అమర్ నాథ్ పాల్గొన్నారు. విశాఖ తీరంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను వారు తొలగించారు. బీచ్ వద్ద కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న తీర పరిసరాల్లోని చెత్తను ఏరివేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన పార్లే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. 

సాగర తీర స్వచ్ఛత కార్యక్రమంలో విశాఖ నగర మేయర్ గొలగాని వెంకట హరికుమారి, జిల్లా కలెక్టర్, సిటీ పోలీస్ కమిషనర్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా నేవీ హెలికాప్టర్ చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.


More Telugu News