కవిత, కేటీఆర్ గురించి జీవిత పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని జీవిత అంటున్నారన్న అనిల్
- అవినీతికి పాల్పడి ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని సవాల్
- కేటీఆర్ కుటుంబ సభ్యులు హీరోలని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై బీజేపీ నాయకురాలు, సినీ నటి జీవిత విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో జీవిత వ్యాఖ్యలపై తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని... తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కవిత ఆస్తులు అమాంతం పెరిగాయంటూ జీవిత చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని కవిత ఇప్పటికే చెప్పారని... అయినప్పటికీ, తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. ఒకవేళ కవిత నిజంగా అవినీతికి పాల్పడి ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో పని చేయించవచ్చు కదా అని అన్నారు. బీజేపీ నేతల మెప్పు పొందడానికే జీవిత ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అనిల్ మండిపడ్డారు. ఆమె ఇలాగే మాట్లాడితే ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు. కేటీఆర్ పై కూడా జీవిత అవినీతి ఆరోపణలు చేయడం ఆమె అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు హీరోలని, అందుకే తెలంగాణ కోసం త్యాగాలు చేశారని అన్నారు. బీజేపీ నేతలు జీరోలు కాబట్టే అధికారం కోసం తహతహలాడుతున్నారని దుయ్యబట్టారు.