ఇప్పుడు వస్తున్న సినిమాల పట్ల ప్రజలు సంతోషంగా లేరు: సునీల్ శెట్టి

  • కథాంశాల పట్ల సంతోషంగా లేకపోవచ్చన్న సునీల్ శెట్టి
  • ప్రజలు థియేటర్లకు కూడా రావడం లేదన్న నటుడు
  • కారణాన్ని తాను వేలెత్తి చూపలేనని వ్యాఖ్య
బాలీవుడ్ లో సినిమాల బాయ్ కాట్ (బహిష్కరణ) ట్రెండ్ నడుస్తోంది. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ బాయ్ కాట్ నిరసనలను ఎదుర్కొంటున్నాయి. దీనిపై రాయ్ పూర్ వచ్చిన బాలీవుడ్ వెటరన్ సునీల్ శెట్టి, మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. 

‘‘మేము చేసిన మంచి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. కానీ, నేటి రోజుల్లో సినిమాల్లో చూపిస్తున్న కథాంశాల పట్ల ప్రజలు సంతోషంగా లేనట్టున్నారు. అందుకే మేము ఈ తరహా కఠిన పరిస్థితులను చూస్తున్నాం. ప్రజలు థియేటర్లకు రాకపోవడాన్ని చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతున్నదనే దానిని నేను వేలెత్తి చూపలేను’’ అని సునీల్ శెట్టి అన్నారు. 

ఒకప్పుడు అయితే ప్రేక్షలకు సినిమాలు, టీవీలు తప్ప పెద్దగా వినోదపరంగా ఐచ్చికాలు ఉండేవి కావు. కానీ, నేడు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తరహా సాధనాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి షోలు, మూవీలను చూసే అవకాశం ఏర్పడింది. 4జీ టెక్నాలజీ రావడం, డేటా చార్జీలు దిగి రావడం, ఓటీటీల ట్రెండ్ నడుస్తుండడం, కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఇది దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమపై పెద్ద ప్రభావాన్నే చూపిస్తోంది.


More Telugu News