చంద్రబాబు భద్రతపై ప్రత్యేక దృష్టి.. నివాసం, టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన ఎన్ఎస్జీ డీఐజీ సమర్ దీప్ సింగ్
- చంద్రబాబు భద్రతపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ఎన్ఎస్జీ
- ఢిల్లీ నుంచి ఎన్ఎస్జీ డీఐజీ నేతృత్వంలో బృందం రాక
- రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను కూడా కలిసిన వైనం
టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన ఎక్కడకు పర్యటనకు వెళ్లినా తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ... ప్రతి పర్యటనలో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భద్రతను ఎన్ఎస్జీజీ పెంచింది. మరోవైపు, ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఎస్జీ డీఐజీ సమర్ దీప్ సింగ్ నేతృత్వంలోని బృందం చంద్రబాబు భద్రతను సమీక్షించారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిశితంగా పరిశీలించారు. చంద్రబాబు ఛాంబర్ ఎక్కడుంది? సందర్శకులను ఆయన ఎక్కడ కలుస్తున్నారు? చంద్రబాబును కలిసేందుకు వచ్చే వారిని పోలీసులు ఎలా తనిఖీ చేస్తున్నారు? తనిఖీలకు ఏయే పరికరాలను ఉపయోగిస్తున్నారు? స్థానిక పోలీసులు చంద్రబాబుకు ఎలాంటి భద్రతను కల్పిస్తున్నారు? తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను కూడా సమర్ దీప్ సింగ్ కలిసినట్టు తెలుస్తోంది. కుప్పంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి నేపథ్యంలో, ఆయన భద్రతపై ఎన్ఎస్జీ ప్రత్యేక దృష్టిని సారించింది.