బండి సంజయ్ పాదయాత్ర పునఃప్రారంభం

  • హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తో పాదయాత్ర ప్రారంభం
  • రేపు ఉదయం ముగియనున్న పాదయాత్ర
  • ఇప్పటికే ముగిసిన రెండు విడతల పాదయాత్రలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మళ్లీ ప్రారంభమయింది. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి లేదంటూ వరంగల్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. 

దీనిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో, ఈరోజు ఆయన పాదయాత్ర పునఃప్రారంభమయింది. ఈ రోజు ఉప్పుగల్, కూనూరు, గర్మెపల్లి, నాగాపురంలో ఆయన ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది.

మరోవైపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాదయాత్రను ప్రారంభించే చోటుకు నిన్న రాత్రే ఆయన చేరుకున్నారు. రేపు ఉదయం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఆయన పాదయాత్ర ముగియనుంది. ఈ నెల 2న ఆయన పాదయాత్ర ప్రారంభమయింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటికే రెండు విడతల పాదయాత్రలు ముగిశాయి. రేపటితో మూడో విడత పాదయాత్ర ముగియనుంది.


More Telugu News