చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రత భారీగా పెంపు.. భద్రతను సమీక్షించిన ఎన్ఎస్జీ డీఐజీ
- ఇప్పటి వరకు చంద్రబాబుకు 6+6 మంది ఎన్ఎస్జీ గార్డులతో సెక్యూరిటీ
- ఈ రోజు మరో 12 మంది నియామకం
- జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రతను భారీగా పెంచారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు పర్యటనల్లో పోలీసుల వైఫల్యం కనిపిస్తుండడంతో, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డీఐజీ స్వయంగా చంద్రబాబు భద్రతను సమీక్షించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఆయన చంద్రబాబు భద్రతను పరిశీలించారు. చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందనే ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఎన్ఎస్జీ డీఐజీ భద్రతను సమీక్షించినట్టు సమాచారం.
ఇప్పటి వరకు చంద్రబాబుకు 6 ప్లస్ 6 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు రక్షణగా ఉండగా... ఈరోజు నుంచి 12 ప్లస్ 12 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు రక్షణగా ఉంటారు.
చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆయన కాన్యాయ్ పై వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరే ప్రయత్నం చేసినట్టు వార్తలొచ్చాయి. దీంతో ఆయనకు భద్రతను భారీగా పెంచారు. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉంటారు. మన దేశంలో ఈ స్థాయి భద్రత కేవలం చాలా కొద్ది మందికి మాత్రమే ఉండటం గమనార్హం.