ఐఎంఎఫ్‌లో భార‌త ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా కేవీ సుబ్ర‌హ్మ‌ణియ‌న్ నియామ‌కం

  • భార‌త ప్ర‌ధాన ఆర్థిక స‌ల‌హాదారుగా ప‌నిచేసిన సుబ్ర‌హ్మ‌ణియ‌న్‌
  • ఈ ప‌ద‌వి నుంచి స్వ‌చ్ఛందంగా త‌ప్పుకున్న ఆర్థిక వేత్త‌
  • ప్ర‌స్తుతం ఐఎస్‌బీలో ప్రొఫెస‌ర్‌గా కొన‌సాగుతున్న వైనం
  • ఐఎంఎఫ్‌లో మూడేళ్ల పాటు కొన‌సాగ‌నున్న సుబ్ర‌హ్మ‌ణియ‌న్‌
భార‌త ప్ర‌ధాన ఆర్థిక స‌ల‌హాదారుగా ప‌నిచేసిన కేవీ సుబ్ర‌హ్మ‌ణియ‌న్‌ను కేంద్ర ప్రభుత్వం తాజాగా మ‌రో కీల‌క ప‌ద‌విలో నియ‌మించింది. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (ఐఎంఎఫ్‌)లో భార‌త ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా సుబ్ర‌హ్మ‌ణియ‌న్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు గురువారం కేంద్రం ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ప‌ద‌విలో సుబ్ర‌హ్మ‌ణియ‌న్ మూడేళ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. 

భార‌త ప్ర‌ధాన ఆర్థిక స‌ల‌హాదారుగా త‌న మూడేళ్ల ప‌ద‌వీ కాలం ముగుస్తున్న స‌మ‌యంలో త‌న‌కు తానుగానే ప‌ద‌వికి రాజీనామా చేసిన సుబ్ర‌హ్మ‌ణియ‌న్‌... ప్రస్తుతం హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెస‌ర్‌గా కొన‌సాగుతున్నారు. అయితే ఆర్థిక రంగంపై సుబ్ర‌హ్మ‌ణియ‌న్‌కు ఉన్న ప‌ట్టును దృష్టిలో పెట్టుకుని ఆయ‌న సేవ‌ల‌ను మ‌రింత కాలం పాటు దేశానికి వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించిన మోదీ స‌ర్కారు... ఆయ‌న‌ను ఐఎంఎఫ్‌లో దేశం త‌ర‌ఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా నియ‌మించింది.


More Telugu News