చంద్రగిరిలో చెవిరెడ్డి మరో భారీ క్రతువు.. ప్రతి ఇంటికి మట్టి గణేశుడి ప్రతిమ పంపిణీకి రంగం సిద్ధం
- 1.24 లక్షల మట్టి వినాయకుల తయారీకి శ్రీకారం
- 2,500 టన్నుల బంక మట్టిని సేకరించిన వైసీపీ ఎమ్మెల్యే
- గత 30 రోజులుగా జరుగుతున్న విగ్రహాల తయారీ
- విగ్రహాల తయారీలో 700 మంది కార్మికులు పనిచేస్తున్నారని వెల్లడి
శ్రీ బాలాజీ జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా భారీగానే ఉంటోంది. అలాంటి కార్యక్రమాల్లో మరో కార్యక్రమానికి చెవిరెడ్డి శ్రీకారం చుట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో పర్యావరణ హితమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వినాయక చవితిని పురస్కరించుకుని ఆయన మట్టి గణపతి ప్రతిమలను అందజేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగా 1.24 లక్షల మట్టి వినాయక విగ్రహాల తయారీకి చెవిరెడ్డి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 90 టిప్పర్లతో 2,500 టన్నుల బంక మట్టిని ఆయన సేకరించారు. నియోజకవర్గ పరిధిలోని దాదాపు 25 ప్రదేశాల్లో 30 రోజులుగా ఈ విగ్రహాల తయారీ శరవేగంగా నడుస్తోంది. మట్టి వినాయకుల తయారీలో 700 మంది కార్మికులు పనిచేస్తున్నట్లుగా చెవిరెడ్డి తెలిపారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గురించి మీడియాకు వివరిస్తున్న తన వీడియోను ఆయన సోషల్ మీడియాలో గురువారం పోస్ట్ చేశారు.